కృతి సనన్ డ్రెస్ వివాదం: ‘ఆమె ఇష్టం’ అన్న రాహుల్.. ‘బ్రో వెయిట్’ అంటూ కంగనా కౌంటర్

August 26, 2026 9:54 AM

రాఖీ యాడ్‌లో కృతి సనన్ డ్రెస్‌పై వివాదం
  • రాఖీ పండుగ యాడ్‌లో కృతి సనన్ ధరించిన డ్రెస్‌పై సోషల్ మీడియాలో విమర్శలు
  • నటికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్
  • యాడ్ వివాదం కాస్తా కాంగ్రెస్, బీజేపీ మధ్య మహిళల హక్కులపై రాజకీయ విమర్శలకు దారితీసింది
కృతి సనన్ ఏమన్నారు?

ఓ నగల బ్రాండ్ రాఖీ పండుగ కోసం రూపొందించిన యాడ్‌లో కృతి సనన్ నటించారు.

ఇందులో ఆమె ధరించిన ఇండో-వెస్ట్రన్ డ్రెస్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.

దీనిపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. రాఖీ కట్టే సమయంలో బికినీ లేదా లో దుస్తులు ధరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

ఈ యాడ్ ఉద్దేశపూర్వకంగానే అసహ్యంగా ఉందని వ్యాఖ్యానించారు.

కంగనా వ్యాఖ్యలకు కృతి సనన్ స్పందించారు. సంస్కృతి, సంప్రదాయాలు గుండెల్లో ఉంటాయని, దుస్తుల్లో ఉండవని అన్నారు.

మహిళలు ఏం ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతారని ప్రశ్నించారు.

రాహుల్ మద్దతు.. కంగనా కౌంటర్

కృతి సనన్ చేసిన పోస్టును కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ షేర్ చేశారు.

ఒక మహిళ ఏం ధరించాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది ఆమె ఇష్టమని అన్నారు.

తమ స్వేచ్ఛను వినియోగించుకున్నందుకు మహిళలను ట్రోల్ చేయడం ఆపాలని సూచించారు.

దీనికి ‘#SmashThePatriarchy’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు.

బీజేపీ చేసిన ఓ పోస్టును షేర్ చేస్తూ.. “బ్రో, వెయిట్.. భారత్ మాతా కీ జై. మొదలు పెడదాం” అని కౌంటర్ ఇచ్చారు.

ఆ బీజేపీ పోస్టులో ట్రిపుల్ తలాక్, మహిళా రిజర్వేషన్ బిల్లు, షా బానో కేసు, కర్ణాటక కేబినెట్‌లో మహిళా మంత్రులు లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు.

మహిళల హక్కుల విషయంలో కాంగ్రెస్ వైఖరిని బీజేపీ ప్రశ్నించింది.

దీంతో కృతి సనన్ నటించిన ఓ రాఖీ యాడ్‌తో మొదలైన వివాదం.. రాహుల్ గాంధీ, కంగనా రనౌత్ మధ్య మాటల యుద్ధంగా మారింది.

చివరకు ఇది కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ విమర్శలకు దారితీసింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media