ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐటీ (SIT) విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ నుండి జూబ్లీహిల్స్ వరకు భారీ ఎత్తున హైడ్రామా చోటుచేసుకుంది.

KTR వెంట వెళ్లేందుకు ప్రయత్నించిన BRS శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యకర్తలు బయటకు రాకుండా పోలీసులు గేట్లు మూసివేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది.
కార్యకర్తలు రోడ్డుపైకి రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలకు గాయాలైనట్లు తెలుస్తోంది.
నిన్న హరీష్ రావును సుమారు 7 గంటల పాటు ప్రశ్నించిన SIT, నేడు కేటీఆర్‌ను ఎన్ని గంటలు విచారిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్‌ను ఒంటరిగానే లోపలికి అనుమతించి, సీనియర్ నేతలను బయట నిలిపివేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నిరసన తెలుపుతున్న పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
