గ్రేటర్ నోయిడాలోని ఓ విలాసవంతమైన ఫ్లాట్‌లో సౌత్ కొరియా పౌరుడు తన లివ్-ఇన్ భాగస్వామి చేతిలో హత్యకు గురైన ఉదంతం సంచలనం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు వార్తా
మణిపూర్‌కు చెందిన 22 ఏళ్ల లుంజీనా పమాయ్ సౌత్ కొరియాకు చెందిన 47 ఏళ్ల డక్ హీ యూ. ఇతను గత పదేళ్లుగా భారత్‌లో ఉంటూ ఒక లాజిస్టిక్స్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ గత రెండేళ్లుగా గ్రేటర్ నోయిడా సెక్షర్-150లోని ‘ATS పయస్ హైడ్ వేస్’ సొసైటీలో కలిసి ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో డక్ హీ యూ మద్యం సేవించడంపై వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

వాగ్వాదం కాస్తా భౌతిక దాడికి దారితీసింది. బాధితుడు తనను తీవ్రంగా కొట్టాడని, ఆ ఆవేశంలో టేబుల్‌పై ఉన్న కత్తితో తాను అతని ఛాతిలో పొడిచానని లుంజీనా విచారణలో తెలిపింది. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
