లింగంపల్లి రైల్వే స్టేషన్‌లోని 6వ ప్లాట్‌ఫాం వద్ద గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు సుమారు 60-65 ఏళ్ల వయస్సు కలిగి ఉండగా, భిక్షాటన చేసే వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, సరైన ఆహారం లేకపోవడం, వృద్ధాప్యం మరియు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే చందానగర్ పోలీస్ స్టేషన్‌ను 8712567229, 8712663186 నంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
