లోక్‌సభ సీట్ల పెంపు: దక్షిణ రాష్ట్రాలపై ప్రభావం ఏంటి?

April 15, 2026 1:11 PM

దేశ రాజకీయ వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తోంది. లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుంచి సుమారు 816కి పెంచే ప్రతిపాదనపై చర్చ కొనసాగుతోంది. 2011 జనగణన ఆధారంగా ప్రో-రాటా పద్ధతిలో ఈ పెంపు చేపట్టాలని యోచిస్తోంది.

ఈ మార్పులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణ రాష్ట్రాలకు సీట్ల సంఖ్య పెరిగినా, వాటి శాతం మాత్రం స్థిరంగా ఉంచే ప్రయత్నం జరుగుతోంది. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.అదేవిధంగా మహిళా రిజర్వేషన్ అమలుకు కూడా కేంద్రం ప్రాధాన్యం ఇస్తోంది. సుమారు 33% సీట్లు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. SC, ST వర్గాలకు కూడా సీట్ల పెంపు ఉండనుంది. ఈ మార్పులు 2029 సాధారణ ఎన్నికల నాటికి అమల్లోకి వచ్చే అవకాశముంది. దీనికోసం 2026లో డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media