Amaravati/London ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సతీమణి నారా భువనేశ్వరి లండన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో స్థానిక ఆంధ్రులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు దంపతులు అభిమానులను ఆత్మీయంగా పలకరించారు.ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) నుంచి నారా భువనేశ్వరికి రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించనున్నాయి. నవంబర్ 4న ఆమెకు “డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025”తో పాటు, హెరిటేజ్ ఫుడ్స్ తరఫున “గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్” అవార్డులు అందించనున్నారు.ప్రజాసేవ, సామాజిక ప్రభావం రంగాల్లో చేసిన కృషిని గుర్తించి IOD ఆమెను డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డుకు ఎంపిక చేసింది. అదే వేదికపై కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ జాతీయ స్థాయి అవార్డును కూడా భువనేశ్వరి స్వీకరించనున్నారు.
ఈ సందర్శనలో సీఎం చంద్రబాబు నాయుడు పలు సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు.
