దేశంలో LPG సిలిండర్ బుకింగ్ 45 రోజులు నిబంధన

March 13, 2026 11:04 AM

దేశంలో ఎల్‌పీజీ (LPG) సరఫరాపై వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా Iran–Israel conflict కారణంగా ఎల్‌పీజీ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ బుకింగ్ మధ్య ఉండే గడువును 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచినట్లు కేంద్రం వెల్లడించింది.

అయితే ఈ నిబంధన గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని, నగరాల్లో మాత్రం పాత నిబంధనైన 25 రోజుల వ్యవధి యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.ఇక కొరత పేరుతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.ఇదిలా ఉండగా దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని Indian Oil Corporation Limited తెలిపింది. దేశవ్యాప్తంగా Indian Oil పెట్రోల్ బంకులు సాధారణంగా పనిచేస్తున్నాయని, సరిపడా నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media