కృష్ణ జిల్లా మచిలీపట్నం కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు కొనసాగుతున్నాయి.
జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. జిల్లా జడ్జి జి. గోపికి గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ ద్వారా బాంబు పెట్టినట్లు హెచ్చరించారు.ఈ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే కోర్టు ప్రాంగణానికి చేరుకుని డాగ్ స్క్వాడ్‌తో కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.ఇలాంటి ఫేక్ బెదిరింపు మెయిళ్లు గతంలో కూడా పలు రాష్ట్రాల్లో వచ్చినట్లు న్యాయవాదుల మధ్య చర్చ జరుగుతోంది. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
