మచిలీపట్నంలో ఉద్రిక్తత.. Janasena VS YSRCP video

March 13, 2026 2:01 PM

Machilipatnamలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. Perni Nani నివాసం సమీపంలోని రామానాడుయుపేట సెంటర్‌లో Jana Sena Party జెండా దిమ్మ నిర్మాణాన్ని అడ్డుకోవడంతో YSR Congress Party మరియు జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

జనసేన నేత శాయన శివయ్యపై వైసీపీ నాయకులు బొర్రా విఠల్, మేకల సుబ్బన్న దాడికి యత్నించారని జనసేన కార్యకర్తలు ఆరోపించారు. దీనికి జనసేన కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.సమాచారం అందుకున్న జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, డీసీఎంఎస్ ఛైర్మన్ Bandi Ramakrishna ఘటన స్థలానికి చేరుకుని వైసీపీ నేతల చర్యలను ఖండించారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.అన్ని అనుమతులతోనే జెండా దిమ్మ నిర్మాణం చేపట్టామని, వైసీపీ నేతల దాదాగిరికి భయపడబోమని బండి రామకృష్ణ తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media