మాగంటి గోపినాథ్ కుటుంబంలో విషాదం AIG ఆసుపత్రిలో చికిత్స

March 23, 2026 5:19 PM

మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. హైదరాబాద్‌లోని Nehru Outer Ring Road పై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కుమార్తెలు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో పెద్ద కుమార్తె అక్షర తీవ్రంగా గాయపడగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రెండో కుమార్తె దిశర స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని వెంటనే గచ్చిబౌలిలోని AIG Hospitals కు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.ప్రాథమిక సమాచారం ప్రకారం అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media