Mahabubabad districtలోని పలు ఫంక్షన్ హాళ్ల వద్ద వినూత్న హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఫంక్షన్‌కు ఆహ్వానం లేని వ్యక్తులు వస్తే రూ.5,000 జరిమానాతో పాటు Section 441 IPC ప్రకారం చర్యలు తీసుకుంటామని బోర్డుల్లో పేర్కొన్నారు.

ఫంక్షన్ హాల్ యాజమాన్యాల ప్రకారం, వివాహాలు లేదా ఇతర కార్యక్రమాలకు సంబంధం లేని వారు వందల సంఖ్యలో రావడంతో అసలు అతిథులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కొందరు 200 నుంచి 300 మంది వరకు అనుమతి లేకుండా హాజరవుతున్నారని వారు తెలిపారు.ఇలాంటి పరిస్థితుల కారణంగా ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకునేందుకు కూడా కొందరు వెనుకంజ వేస్తున్నారని యాజమాన్యాలు చెబుతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన హాళ్లకు గిరాకీ తగ్గిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

