మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి.
అమరావతి BNS మార్చ్ 17.మహిళలు నాయకత్వ లక్షణాలు పెంచుకొని స్వతంత్రంగా వ్యవహరించినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుంది. అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో సొసైటీ ఫర్ పబ్లిక్ లా అండ్ గవర్నెన్స్ విట్ ఏపీ- స్కూల్ ఆఫ్ లా వారు నిర్వహించిన Barriers & Building Futures Women in Leadership in the Contemporary World అనే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ……………. గతంతో పోల్చుకుంటే మహిళలు, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ముందుకు సాగుతున్నారని ఇంకా మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడం ఇంటి నుండే మొదలు కావాలన్నారు. ఆడ,మగ అనే తేడా లేకుండా సమానంగా చూసే సంస్కృతి పెంపొందించాలన్నారు. స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ అమలవుతున్నప్పటికీ పదవుల్లో ఆడవారు ఉన్న పెత్తనం మాత్రం మగవారి చేతిలో సాగుతుందని ఈ విధానానికి స్వస్తి పలికి మహిళల స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు. చదువుకునే మహిళలకు వివాహమైనప్పుడు వారి విద్యకు ఆటంకం కలగకుండా కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో మెటర్నటీ లివ్స్ ను మంజూరు చేయాలన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని చట్టాలు చేసే చట్టసభల్లో కీలక భూమిక పోషించాలన్నారు. మహిళల రక్షణ, సంరక్షణ ఏ ఒక్కరి బాధ్యత కాదని అది సమాజం మొత్తం సమిష్టి బాధ్యతన్నారు. సమాజంలో ఉన్న రుగ్మతలైన బాల్యవివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీలు, సోషల్ మీడియా మిస్ లీడ్స్ వంటి అంశాలకు వ్యతిరేకంగా మహిళా కమిషన్ పనిచేస్తుందని సమాజం కూడా వీటికి వ్యతిరేకంగా పని చేయాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అనేది అత్యంత కీలకమైనది.మహిళలు కుటుంబానికి మాత్రమే కాదు, సమాజానికి మరియు దేశ నిర్మాణానికి కూడా బలమైన పునాదులుగా నిలుస్తారన్నారు.ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మహిళల హక్కులను కాపాడేందుకు, వారికి న్యాయం అందించేందుకు, భద్రతను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. మహిళల సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాకుండా వారికి అవగాహన కల్పించడం కూడా మా ముఖ్య బాధ్యతగా వ్యవహరిస్తున్నామని రాయపాటి శైలజ అన్నారు.
