రాపూరు మండలం మల్లమ్మగుంట గ్రామంలో అక్రమ బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాపూరు ఎస్సై Venkata Rajesh హెచ్చరించారు.
గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అక్రమంగా మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తామని స్పష్టం చేశారు. మద్యం వల్ల కుటుంబాలు నష్టపోతున్నాయని, బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించాలని సూచించారు.అధిక వడ్డీలతో ప్రజలను వేధించే వారిపై కూడా నిఘా ఉంచామని, ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పిల్లలు తప్పనిసరిగా విద్యను అభ్యసించాలని, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని గుర్తుచేశారు.వర్షాకాలంలో పరిశుభ్రత పాటించి సీజనల్ వ్యాధులను నివారించుకోవాలని, గ్రామాన్ని నేరరహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
