మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలి: IPS మలికా గార్గ్

March 7, 2026 2:38 PM

Vijayawadaలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఐపీఎస్ అధికారి Mallika Garg మహిళలకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మహిళా అధికారుల ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా మలికా గార్గ్ మాట్లాడుతూ మహిళలు తమ సామర్థ్యాన్ని గుర్తించి ధైర్యంగా ముందుకు సాగితే ఏ రంగంలోనైనా అగ్రస్థానానికి చేరుకోవచ్చని అన్నారు. ఆత్మవిశ్వాసం, విద్య, ఆర్థిక స్వావలంబనతో మహిళలు అన్ని సవాళ్లను ఎదుర్కొనగలరని పేర్కొన్నారు.

కార్యక్రమానికి P. Krishnaiah అధ్యక్షత వహించగా, Dr. Sravanthi పాల్గొని మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media