పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి Mamata Banerjee కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఒకేసారి 23 లాభదాయక పదవులకు రాజీనామా చేశారు.
వివిధ విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవులతో పాటు పలు ప్రభుత్వ కమిటీల బాధ్యతల నుంచి కూడా ఆమె తప్పుకున్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.రాజకీయంగా ఎలాంటి వివాదాలు లేకుండా ఎన్నికలకు వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ వ్యూహాత్మక అడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
