AP: Hi కొట్టారో హాల్ టికెట్ పట్టారు మనమిత్ర సేవకు భారీ స్పందన

March 16, 2026 11:55 AM

పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవకు భారీ స్పందన లభించింది. రాష్ట్రంలో మొదటిసారిగా విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పించారు.

ఈ కార్యక్రమానికి ఐటీ, విద్యాశాఖ మంత్రి Nara Lokesh ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని అధికారులు తెలిపారు. పదో తరగతి పరీక్షలకు ముందే అన్ని ఏర్పాట్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు.ప్రభుత్వం అందించిన మనమిత్ర వాట్సాప్ సేవ (9552300009) ద్వారా మొత్తం 3,16,990 హిట్లు నమోదయ్యాయి. అందులో 2,38,728 మంది విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకున్నారు. అలాగే లీప్ యాప్ ద్వారా 65,477 మంది, అధికారిక వెబ్‌సైట్ ద్వారా 7,53,834 మంది హాల్ టికెట్లు పొందారు.డిజిటల్ సేవలను విద్యార్థులు పెద్ద ఎత్తున వినియోగించడం ద్వారా విద్యార్థుల్లో డిజిటల్ అవగాహన పెరిగిందని అధికారులు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media