మంచిర్యాలలో గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థి మిస్సింగ్

March 5, 2026 3:11 PM

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి పెద్దపోలు నాగ వర్ధన్ కనిపించకపోవడం స్థానికంగా కలకలం రేపింది.

నిన్న సాయంత్రం నుంచి హాస్టల్‌లో ఉన్న విద్యార్థి కనిపించకపోవడంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. హాస్టల్ నుంచి అకస్మాత్తుగా విద్యార్థి మిస్సింగ్ కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.చెన్నూరు పట్టణంలోని మహంకాళివాడకు చెందిన నాగ వర్ధన్ కనిపించకపోవడంతో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హాస్టల్ వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.విద్యార్థిని వెంటనే గుర్తించి సురక్షితంగా తమకు అప్పగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media