మండపేట తహశీల్దార్ కార్యాలయంలో ఓటరు నమోదు ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సహాయ ఓటరు నమోదు అధికారి, తహశీల్దార్ P. Tejeswara Rao అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా చేర్పులు, మార్పులు, తొలగింపులు, కొత్త ఓటర్ల నమోదు వివరాలు మరియు స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై అధికారులు వివరించారు. ఇప్పటివరకు 2002 ఓటర్ జాబితాలో 57 శాతం సంతానం మ్యాపింగ్ పూర్తయ్యిందని తెలిపారు.సమావేశంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు పోలింగ్ స్టేషన్ల కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మండపేట పెద్ద కాలువ వంతెన నుంచి రాజారత్న సెంటర్ వరకు పోలింగ్ స్టేషన్ లేకపోవడం వల్ల ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.దీనిపై అధికారులు స్పందిస్తూ, కొత్త పోలింగ్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదన ఇప్పటికే సంబంధిత అధికారులకు పంపినట్లు తెలిపారు.
