వాషింగ్టన్: సౌదీ అరేబియాతో ప్రతిపాదిత Civil Nuclear Dealపై అమెరికా సెనెటర్ మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. సౌదీ అరేబియా అమెరికాకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి అని, ఆ దేశంతో అణు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచంలో Nuclear Technology అందించే ఏకైక దేశం అమెరికా మాత్రమే కాదని రూబియో గుర్తుచేశారు. “ఏదైనా దేశం శాంతియుత పౌర అణు కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావిస్తే, వారు వేరే ఇతర దేశాల కంటే అమెరికాతోనే కలిసి పనిచేయడానికి మేము ప్రాధాన్యత ఇస్తాము” అని ఆయన పేర్కొన్నారు.
అమెరికాతో ఒప్పందం చేసుకోవడం వల్ల ఆయా ప్రాజెక్టుల దిశానిర్దేశంపై అమెరికాకు పర్యవేక్షణ ఉంటుందని, తద్వారా తగిన భద్రతా ప్రమాణాలు అమలయ్యేలా చూడవచ్చని రూబియో వివరించారు. సౌదీ అరేబియాతో ఇలాంటి ఒప్పందం చేసుకోవడం అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగానే ఉంటుందన్నారు.
అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడతాయని, ఆ తర్వాత ఇది అమెరికా కాంగ్రెషనల్ రివ్యూ ప్రొసెస్ కు వెళ్తుందని ఆయన తెలిపారు.



