ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర B.C సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాపూరు మండలం గండురూపల్లికి చెందిన మతకాల సాయి ప్రసాద్ నియమితులయ్యారు. బి.సి.ల హక్కుల పోరాట యోధులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది.

B.C సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు గువ్వల భరత్ కుమార్ చేతుల మీదుగా సాయి ప్రసాద్ నియామక పత్రాన్ని అందుకున్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ఆర్. కృష్ణయ్యకు, గువ్వల భరత్ కుమార్‌కు, రాష్ట్ర అధ్యక్షులు ఎన్. మారేష్ మరియు షామీర్ పేట రాజేష్‌లకు సాయి ప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బి.సి. యువత హక్కుల కోసం, వారి విద్యా, ఉపాధి అవకాశాల కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.మతకాల సాయి ప్రసాద్ నియామకం పట్ల గండురూపల్లి గ్రామస్థులు మరియు బి.సి. సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
