మెగాస్టార్ చిరంజీవి ఇటీవల భుజానికి చిన్నపాటి కీ-హోల్ శస్త్రచికిత్స (Shoulder Keyhole Surgery) చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ, తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు తెరదించారు.

ఇటీవల అల్లు శిరీష్ వెడ్డింగ్ కార్డ్ అందజేస్తున్న సమయంలో చిరంజీవి చేతికి ఆర్మ్ స్లింగ్ (Arm Sling) ఉండటం చూసి అభిమానులు కంగారు పడ్డారు. “ఆర్మ్ స్లింగ్ చూసి చాలా మంది నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. భుజానికి చిన్న కీ-హోల్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం నేను బాగానే కోలుకుంటున్నాను మరియు నా దినచర్యను కూడా మొదలుపెట్టాను” అని చిరు పేర్కొన్నారు. అత్యుత్తమ ఆర్థోస్కోపీ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నితిన్‌కు మరియు తన క్షేమం కోరిన అభిమానులందరికీ మెగాస్టార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

