కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ఈరోజు (డిసెంబర్ 13, 2025) హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాల్గొనే ఫ్రెండ్లీ మ్యాచ్‌ను ఆయన వీక్షించనున్నారు.

సాయంత్రం 4:15 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రానున్నారు, ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్‌కు చేరుకుంటారు. రాత్రి 7:00 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుని, మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి జట్ల మధ్య జరగనున్న ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించనున్నారు.
రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని ప్రత్యేకంగా కలవనున్నారు. రాత్రి 9:15 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరనున్నారు.
