మెటాలో భారీ ఉద్యోగాల కోత

May 20, 2026 4:05 PM

అమెరికా టెక్ దిగ్గజం మెటా మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. బుధవారం దాదాపు 8 వేల మందిని తొలగించే అవకాశమున్నట్లు సమాచారం. అదే రోజు ఉత్తర అమెరికా ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని సంస్థ ఆదేశించింది. ఉద్యోగాల కోత ప్రక్రియ సాఫీగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాయిటర్స్ వెల్లడించిన అంతర్గత మెమో ప్రకారం, హెచ్‌ఆర్‌ చీఫ్ జానెల్ గేల్ ఉద్యోగులకు కీలక సమాచారం పంపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4 గంటలకు ఉద్యోగులకు మెయిల్స్ పంపనున్నారు. ఈ ప్రక్రియను మూడు ప్రాంతీయ దశల్లో అమలు చేస్తారని పేర్కొన్నారు.

ఉద్యోగాలు కొనసాగించే సుమారు 7 వేల మందిని నాలుగు కొత్త ఏఐ కేంద్రిత విభాగాల్లోకి మార్చనున్నారు. కృత్రిమ మేధస్సు రంగంపై మెటా మరింత దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు సమాచారం.

సంస్థలో ఖర్చులు తగ్గించడం, ఏఐ అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నారని టెక్ వర్గాలు చెబుతున్నాయి. గత రెండేళ్లుగా మెటా పలుమార్లు ఉద్యోగాల కోతలు చేపట్టింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media