హనుమాన్ మాలలో ఉన్న విద్యార్థులకు అనుమతి నిరాకరణ video

March 16, 2026 1:31 PM

మెట్‌పల్లి పట్టణంలోని Nikhil Bharat School వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హనుమాన్ మాలలో ఉన్న ఐదుగురు విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించకపోవడంతో వివాదం చెలరేగింది.

పాఠశాల నియమ నిబంధనల ప్రకారం 21 రోజుల పాటు స్కూల్‌కు అనుమతించలేమని యాజమాన్యం తెలిపింది. దీనిపై ఆగ్రహించిన Hanuman Deeksha స్వాములు పాఠశాల ముందు ధర్నా చేపట్టి నిరసన తెలిపారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొందరు ఆగ్రహంతో పాఠశాల ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం యాజమాన్యం విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించినట్లు సమాచారం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media