NTR జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విజయవాడ ఉత్తర మండల పరిధిలోని పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆమె, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత, సౌకర్యాలపై సమగ్రంగా పరిశీలించారు.

కలెక్టర్ స్వయంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి, పథకం అమలులో ఉన్న పరిస్థితులను అంచనా వేశారు. విద్యార్థులకు శుభ్రత, నాణ్యతతో కూడిన ఆహారం అందుతున్నదా అనే అంశాలపై అధికారులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కాలి లక్ష్మి, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు కృష్ణ పద్మ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
