కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు

April 12, 2026 8:53 PM


2027 గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాజమహేంద్రవరం లో రూ.9.55 కోట్లతో ఫేజ్-1 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానుండగా, ముందస్తుగా దేవాలయాల పునర్నిర్మాణం, మౌలిక సదుపాయాల విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని 43 దేవాలయాల అభివృద్ధికి రూ.51.79 కోట్ల నిధులు మంజూరు చేశారు.దేశ, విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, గోదావరి నది పరిధిలోని 212 కిలోమీటర్ల ప్రాంతంలో స్నాన ఘాట్లు, సౌకర్యాలపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media