రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల అభివృద్ధిపై మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి బుధవారం అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వినియోగం మరియు హాస్టళ్లలో వసతుల కల్పనపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వంద శాతం వినియోగించేలా తక్షణమే కార్యాచరణ ప్రణాళిక (Action Plan) రూపొందించాలని మంత్రి ఆదేశించారు.PM అజయ్ (PM-AJAY) కింద చేపట్టిన నూతన హాస్టళ్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అద్దె భవనాల్లో ఉన్న హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని సూచించారు.సంక్షేమ హాస్టళ్లు, అంబేద్కర్ గురుకులాల్లో భద్రత కోసం త్వరితగతిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు ఆర్వో (RO) ప్లాంట్లు నెలకొల్పాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో హాస్టళ్లలో అడ్మిషన్లు వంద శాతం పూర్తయ్యేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అట్రాసిటీ బాధితులకు అందాల్సిన పరిహారం నిధుల విడుదలపై సమీక్షించి, బాధితులకు సకాలంలో న్యాయం చేయాలని కోరారు.
