సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వంతో కీలక ఎంఓయూ కుదుర్చుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు, సింగపూర్ హోం శాఖ మంత్రి కె. శణ్ముగం సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
అర్బన్ గవర్నెన్స్, రియల్ టైమ్ & డిజిటల్ గవర్నెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ సుస్థిర అభివృద్ధి రంగాల్లో సహకారం ,విజయవాడ–సింగపూర్ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభించే నిర్ణయం
సంతకాల కార్యక్రమంలో సింగపూర్ విదేశీ వ్యవహారాలు, ట్రేడ్ & ఇండస్ట్రీ మంత్రి గాన్ సో హాంగ్, మంత్రి నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు.
“ఏపీ–సింగపూర్ ఎంఓయూ అద్భుతమైన ప్రయాణానికి ప్రారంభం”
“రెండో అవకాశం ఇచ్చిన సింగపూర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు”
“సీఎం చంద్రబాబు అనుభవజ్ఞానంతో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుంది”
“సింగపూర్ అభివృద్ధి వేగానికి ఏపీ కూడా సరితూగుతుంది”


