రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి డాక్టర్ నారాయణ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఈ భేటీలో మున్సిపల్ శాఖకు సంబంధించి కేంద్ర పథకాల ద్వారా రావాల్సిన నిధుల కేటాయింపు, విడుదల అంశాలపై చర్చించారు.
మంత్రి నారాయణతో పాటు శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమృత్ పథకం, 15వ ఆర్థిక సంఘం కింద పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేయాలని ఆయన కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి ప్రతిపాదనలపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
