ఒకప్పుడు సాదాసీదా గ్రామంగా ఉన్న భోగాపురం, నేడు అంతర్జాతీయ విమానాశ్రయానికి చిరునామాగా మారడం గర్వకారణమని రాష్ట్ర మంత్రి సవిత పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆమె స్పష్టం చేశారు.

విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు ఆలోచన వల్లే భోగాపురం నేడు గ్లోబల్ మ్యాప్‌లోకి ఎక్కిందని కొనియాడారు. “ఎర్రబస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్ బస్సు ఎందుకు?” అని గతంలో హేళన చేసిన జగన్ మోహన్ రెడ్డి, ఏపీ అభివృద్ధికి పట్టిన శని అని మంత్రి ఘాటుగా విమర్శించారు.గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఆలస్యమైనా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు పరుగులు పెడుతున్నాయని ఆమె తెలిపారు.
