మియాపూర్‌లో వరుస దొంగతనాలు: నిందుతుడు అరెస్ట్

April 25, 2026 12:30 PM

హైదరాబాద్‌లోని Miyapur ప్రాంతంలో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, నెల్లూరు జిల్లా కావలి మండలానికి చెందిన వల్లెపు వెంకటేష్ (25) మియాపూర్‌లో నివాసం ఉంటూ అపార్ట్‌మెంట్‌లు, వాచ్‌మెన్ గదులను లక్ష్యంగా చేసుకుని తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవాడు.గతంలోనే వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 45 ఆస్తి నేరాల్లో నిందితుడిగా ఉన్న వెంకటేష్‌ను మయూరినగర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి వద్ద నుంచి 4 గ్రాముల బంగారు ఆభరణాలు, 607 గ్రాముల వెండి వస్తువులు మరియు ఒక యాక్టివా బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media