జనగామ జిల్లా కేంద్రంలో రాజకీయ పోరు ముదిరింది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు.

మంత్రి సీతక్క సమక్షంలోనే మద్యం మత్తులో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పథకం ప్రకారమే మద్యం తాగించి ఈ దాడి చేయించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య పల్లాను అక్కడి నుండి తరలించారు. ప్రస్తుతం జనగామలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మంత్రి సీతక్క సమక్షంలోనే జరిగిన ఈ ఘర్షణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ
