MLA జూలకంటి మాచర్ల ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

March 12, 2026 4:04 PM

Julakanti Brahmananda Reddy పల్నాడు జిల్లా Macherlaలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు, పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఆయన వివరాలు తెలుసుకున్నారు.

అసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించిన ఎమ్మెల్యే, చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రజా ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఆయన తెలిపారు.ఆసుపత్రిలో పారిశుధ్యం, టాయిలెట్లు, ఎలక్ట్రికల్ సమస్యలు లేకుండా చూడటంతో పాటు వెయిటింగ్ హాల్, పార్కింగ్ వంటి సదుపాయాలు మెరుగుపరిచామని చెప్పారు. అవసరమైతే ఆసుపత్రి అభివృద్ధి కోసం తన సొంత నిధులు వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే తాగునీటి కోసం 6–7 వాటర్ డిస్పెన్సర్లు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ చేయాలని వైద్యులకు సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media