విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలను 34వ వార్డులో జనసేన మరియు కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకుడు పేడాడ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఆధ్యాత్మిక, సేవా భావంతో జరిగాయి.
MLA పుట్టినరోజును పురస్కరించుకుని సుమారు 250 మంది అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు (RPs), మరియు శానిటేషన్ సిబ్బందికి చీరలు, పండ్లను పంపిణీ చేశారు.వాసుపల్లి దానయ్య ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అభిమానులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇంచార్జ్ నారా నాగేశ్వరరావు, నీలం రాజు, మత్స్యకార నాయకులు వాసుపల్లి నరేష్, ఉమ్మడి గురుమూర్తి, నానబాల గణేష్, నరి యాదవ్ మరియు జనసేన వీరమహిళలు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.
