ప్రజలకు నాణ్యమైన మరియు మెరుగైన వైద్య సేవలను వారి ముంగిటకే చేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. మంగళవారం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ (B.P.H.U) భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
గ్రామీణ ప్రాంత ప్రజలు చిన్నపాటి రక్త పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే అనుసంధానంగా ఈ ల్యాబ్‌లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి 33 సెంట్ల స్థలాన్ని వితరణగా అందించిన దాత వడ్లమూడి వరప్రసాద్ ను ఎమ్మెల్యే రాము ప్రత్యేకంగా అభినందించారు. ల్యాబ్ నివేదికలు త్వరగా రావడం వల్ల రోగులకు ముందస్తు వైద్యం అందించేందుకు వైద్యులకు వీలు కలుగుతుందని, ఈ ఆధునిక సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వల్లభనేని వెంకటరావు, పోలవరపు వెంకటరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి మరియు పీహెచ్సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా వైద్య రంగంలో కూటమి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెస్తోందని, ప్రజల ఆరోగ్య భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పునరుద్ఘాటించారు.
