పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
పిడుగురాళ్ల పట్టణంలోని 5 మరియు 6వ వార్డులకు చెందిన వివిధ రకాల పింఛన్ దారులకు ఎమ్మెల్యే స్వయంగా నగదును అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇరువూరి శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పింఛన్ అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేశారు.ప్రజల ముంగిటకే సంక్షేమ పథకాలను చేరవేస్తామని, ప్రతి పేదవాడికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా యరపతినేని పేర్కొన్నారు.
