పిడుగురాళ్లలో ‘స్వచ్ఛ రథం’ ప్రారంభించిన ఎమ్మెల్యే యరపతినేని!

March 1, 2026 9:00 AM

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” లక్ష్యంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద “పిడుగురాళ్ల మండల స్వచ్ఛ రథం”ను స్థానిక శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు.

పిడుగురాళ్ల మండల పరిధిలోని గ్రామాల్లో ఈ స్వచ్ఛ రథం తిరుగుతుంది. ప్రజలు తమ ఇళ్ల వద్ద ఉన్న పొడి చెత్తను (ప్లాస్టిక్, పేపర్ తదితరాలు) ఈ రథానికి అప్పగిస్తే, అందుకు ప్రతిగా వారికి కావాల్సిన నిత్యావసర సరుకులను అక్కడికక్కడే అందజేస్తారు. గ్రామాలు ప్లాస్టిక్ రహితంగా ఉండటంతో పాటు, ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఎమ్మెల్యే యరపతినేని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media