వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించడంతోనే రైతుల అభివృద్ధి సాధ్యమని శ్రీకాకుళం జిల్లా పరిషత్ సీఈఓ ఆర్. వెంకటరామన్ అన్నారు.
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన “ఉత్తరకొస్తా మండల వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి సమావేశం” రెండవ రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఆచార్య ఎన్.జీ. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వరి, మొక్కజొన్న, చెరుకు, నూనెగింజల వంటి ప్రధాన పంటలపై రాబోయే ఏడాది చేపట్టవలసిన పరిశోధన కార్యక్రమాలపై చర్చించి ఆమోదించారు.ఈ సందర్భంగా జీవ ఎరువులు, జీవ నియంత్రణ పద్ధతులు, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు వంటి అంశాలపై నిపుణులు ప్రత్యేక ప్రసంగాలు నిర్వహించారు.ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, బ్యాంకు ప్రతినిధులు మరియు అభ్యుదయ రైతులు పాల్గొని రైతులకు మేలు చేసే పలు అంశాలపై చర్చించారు.
