రాజేశ్ (46), సుమన్ (44) దంపతుల కుమారుడు ఆశిష్. రెండేళ్ల క్రితం ఆశిష్‌కు సోషల్ మీడియాలో స్నేహ అనే యువతి పరిచయం అయ్యింది. ఆ తరువాత ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో వారు 2025లో జనవరిలో పెళ్లి చేసుకున్నారు. రాజేశ్ దంపతులు గ్రామంలో నివసిస్తుంటారు. కోడలు స్నేహ కురచ దుస్తులతో నిత్యం వీడియోలు రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. కోడలి తీరుపై అత్తమామలు అభ్యంతరం చెప్పేవారు.
తమ కుమారుడు భార్యను ఒక్కమాట కూడా అనకపోతుండడంతో రాజేశ్, సుమన్‌లు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని గుర్తించిన బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై రాజేశ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
