మసెల్స్ సముద్రపు కుటుంబం మైటిలిడే (Mytilidae) మరియు ఫ్రెష్ వాటర్ స్పీసీస్ కుటుంబం యూనియోనిడే (Unionidae)కు చెందిన ద్విపటల(bivalve molluscs) మోలస్కులు. ఇవి ప్రపంచవ్యాప్తంగా పసిఫిక్, అట్లాంటిక్, మరియు మెడిటరేనియన్ సముద్రాల్లో విస్తరించి ఉన్నాయి. సాధారణంగా ఇవి సముద్రపు అడుగున రాళ్లకు లేదా ఇతర మసెల్స్‌కి చిటిన్(chitin)తో తయారైన బైసల్ తంతువులు (Byssal threads) ద్వారా బలంగా అంటుకుని ఉంటాయి.
మసెల్స్ ప్రధానంగా చల్లని సముద్రాల్లో, అలాగే మంచినీటి నదులు, సరస్సులు, చెరువుల్లో నివసిస్తాయి. ఇవి ఫిల్టర్ ఫీడర్స్, అంటే రోజు కి 17 గ్యాలన్లకుపైగా నీటిని ఫిల్టర్ చేస్తాయి, తద్వారా సముద్ర జీవవ్యవస్థ శుభ్రతలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి ఆయుష్షు 50 సంవత్సరాల వరకు జీవిస్తాయి.
పోషకపరంగా, మసెల్స్‌లో విటమిన్ B, C, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, మరియు ఇనుము, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో ఇవి ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు. శాస్త్రవేత్తలు వీటి అంటుకునే గుణాన్ని ఆధారంగా తీసుకొని శస్త్రచికిత్సలకు బయో-అడ్హీసివ్‌లు తయారు చేయడంపై పరిశోధనలు చేస్తున్నారు.
జీవసూచకాలుగా (Bioindicators) మసెల్స్ నీటిలోని లోహాలు, మైక్రోప్లాస్టిక్‌లు వంటి కాలుష్యాలను ఆపుతాయి , నీటి నాణ్యతను అంచనా వేయడంలో ఉపయోగపడతాయి. అయితే, ఇవి కాలుష్యం, తీరరేఖల ధ్వంసం, సముద్ర ఆమ్లీకరణ వంటి పర్యావరణ సమస్యల వల్ల తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.


