గోదాములో పేలిన నిల్వ పేలుడు పదార్థాలు
మయన్మార్: మయన్మార్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన గోదాములో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకోవడంతో ఈ విషాదం జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనలో 70 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆస్పత్రులకు తరలించారు
పేలుడు కారణాలపై దర్యాప్తు
గోదాములో పేలుడు ఎందుకు సంభవించిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారా అనే కోణంలో కూడా అధికారులు గాలిస్తున్నారు.
పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, ఇతర భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతంలో భారీ నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.



