సినీ నటుడు నాగ చైతన్య వ్యక్తిత్వ హక్కులకు ఢిల్లీ హైకోర్టు రక్షణ కల్పించింది. ఏఐ సాయంతో రూపొందించిన నటుడి చిత్రాలను ఇష్టానుసారం వినియోగించడానికి వీల్లేదని జస్టిస్ జ్యోతి సింగ్ మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. వ్యాపార కార్యకలాపాల్లో ఆయన అనుమతి లేకుండా ఆయన చిత్రాలను వాడటానికి వీల్లేదని, నాగ చైతన్య చిత్రం కలిగి ఉన్న ఎలాంటి ఉత్పత్తులనైనా ఆయన అనుమతి లేకుండా విక్రయించరాదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఆయన చిత్రంతో ఉన్న అభ్యంతరకర చిత్రాలను ఆన్‌లైన్ వేదికల నుంచి తొలగించాలని ఆదేశించారు.

