లైన్ల ఆధునీకరణ పనులతో సవరణ
Nagercoil–Kacheguda Express మధ్య నడిచే నంబర్ 16354 రైలు వేళలను జూన్ 20 నుంచి మార్చనున్నారు. లైన్ల ఆధునీకరణ, సిగ్నలింగ్ పనుల కారణంగా ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్న రైల్వే అధికారులు, ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ రైలు సమయాన్ని మార్చడం ఇదే తొలిసారి కాదు. తొలుత జూన్ 20 నుంచి ఉదయం 9:25 గంటలకు బయలుదేరుతుందని ప్రకటించారు. తర్వాత దాన్ని ఉదయం 11:05 గంటలకు సవరించారు.
ఇప్పుడు మరోసారి మార్పు చేసి, మధ్యాహ్నం 12:20 గంటలకు నాగర్‌కోయిల్ నుంచి బయలుదేరేలా కొత్త టైమ్‌టేబుల్ ఖరారు చేశారు.
దీంతో రైలు మొత్తం ప్రయాణ సమయాలు, వివిధ స్టేషన్లలో చేరే వేళల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి.
( Nagercoil–Kacheguda Express)ఈ మార్గంలో ప్రయాణం:
జూన్ 20 నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు నాగర్‌కోయిల్ నుంచి బయలుదేరే నంబర్ 16354 ఎక్స్‌ప్రెస్ వల్లియూర్, తిరునెల్వేలి, కోవిల్‌పట్టి, మధురై, దిండిగల్, తిరుచిరాపల్లి, కరూరు, నామక్కల్, రాశిపురం, సేలం, జోలార్‌పేట, వనియంబాడి, గుడియాత్తం, కాట్పాడి, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, కడప, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూలు, గద్వాల, మహబూబ్‌నగర్ మీదుగా కాచిగూడకు చేరుకుంటుంది.
ఇదిలా ఉండగా, ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో ఏపీ, తెలంగాణ నుంచి నడిచే పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను కూడా రైల్వే అధికారులు పొడిగించారు.
నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి వివిధ ప్రధాన గమ్యస్థానాలకు ఈ ప్రత్యేక రైళ్లు కొనసాగనున్నాయి.
అయితే, కొత్త టైమ్‌టేబుల్ అమల్లోకి రావడంతో ఈ రైలులో ప్రయాణించే వారు ముందుగానే తమ టికెట్లు, బోర్డింగ్ స్టేషన్ సమయాలను మరోసారి పరిశీలించుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా మధ్యలో ఎక్కే ప్రయాణికులు పాత సమయాలను ఆధారంగా చేసుకుని స్టేషన్‌కు వస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఐఆర్‌సీటీసీ యాప్‌లలో తాజా రన్నింగ్ స్టేటస్, షెడ్యూల్‌ను ఒకసారి చూసుకుని బయలుదేరాలని అధికారులు సూచించారు.



