నకిరేకల్ నియోజకవర్గంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. నకిరేకల్ సెంటర్లో కార్యకర్తలతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా స్టెప్పులేయడం అక్కడి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కార్యకర్తలపై రంగులు చల్లుతూ, వారితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఎమ్మెల్యే హోలీని ఘనంగా జరుపుకున్నారు.నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే హోలీ శుభాకాంక్షలు తెలిపారు.”ఈ హోలీ ప్రజలందరి జీవితాల్లో రంగుల హరివిల్లులాంటి వెలుగులు నింపాలి” అని ఆయన ఆకాంక్షించారు.నకిరేకల్ సెంటర్లో సందడి చేసిన కార్యకర్తలు మరియు నాయకులు.
