TG:నల్గొండలో హైవే అభివృద్ధికి రూ.14.45 కోట్లు మంజూరు

March 31, 2026 12:16 PM

నకిరేకల్–నాగార్జునసాగర్ నేషనల్ హైవే 565లో భాగంగా నల్గొండ పట్టణంలో రహదారి అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.14.45 కోట్లు మంజూరు చేసింది. పానగల్ బైపాస్ నుంచి డీఈఓ కార్యాలయం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.

ఇప్పటికే రోడ్డు విస్తరణపై స్థానికులు కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చొరవతో హైవేను బైపాస్ మార్గంగా మళ్లించడంతో పాటు పట్టణంలో రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.2025–26 వార్షిక ప్రణాళిక కింద పరిపాలనా, సాంకేతిక అనుమతులు లభించగా, బ్లాక్ టాపింగ్ విధానంలో పనులు చేపట్టనున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి కోరారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media