నల్లగొండ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన కొత్త లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. కార్మిక సంఘాల పిలుపు మేరకు వివిధ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులు తమ విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు.

నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్‌లో CITU, AITUC, IFTU, INTUC సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే పాటిస్తూ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, కొత్త లేబర్ చట్టాలు కార్మికులకు నష్టం కలిగిస్తాయని ఆరోపించారు.పాత కార్మిక చట్టాలనే కొనసాగిస్తూ, కొత్త చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
