Nalgonda జిల్లాలో రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి Komatireddy Venkat Reddy అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నల్లగొండలోని ఇందిరా భవన్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, మేయర్ బుర్రి చైతన్య తదితర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాత్రి పగలు తేడా లేకుండా ఫ్లడ్ లైట్ల వెలుగులో కూడా ధాన్యం కొనుగోళ్లు జరిపి మిల్లులకు తరలించాలని సూచించారు.

ఒక్క నల్లగొండ నియోజకవర్గంలోనే సుమారు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశముందని, అందుకనుగుణంగా కొనుగోళ్లు వేగవంతం చేయాలని తెలిపారు. రోడ్లపై ధాన్యం పోయకుండా అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాల్స్ వద్ద తాత్కాలిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ధాన్యం అధికంగా వచ్చే గ్రామాలను గుర్తించి, అక్కడికి అదనపు సిబ్బంది, లారీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే రైతులు, కొనుగోలు కేంద్రాల సిబ్బందికి తాగునీరు, నీడ వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని మంత్రి పేర్కొన్నారు.
