నల్గొండ సెట్విన్ శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

March 15, 2026 10:13 AM

నల్గొండ జిల్లా కేంద్రంలోని SETWIN శిక్షణ సంస్థను రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి Komatireddy Venkat Reddy అన్నారు.

ఈ సందర్భంగా సెట్విన్ సంస్థలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన 116 మంది మహిళలకు మంత్రి కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. సెట్విన్ ద్వారా ఇప్పటివరకు 27 కోర్సుల్లో 1,250 మందికి శిక్షణ అందించామని తెలిపారు.శిక్షణ పొందిన మహిళలు సంఘాలుగా ఏర్పడి స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పిస్తుందని మంత్రి వెల్లడించారు. అలాగే సెట్విన్ ద్వారా కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసిన మహిళలను ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లుగా నియమించే అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు నైపుణ్య శిక్షణ చాలా అవసరమని మంత్రి పేర్కొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media