Nara Bhuvaneswari ప్రజాసేవే పరమావధిగా NTR Memorial Trust సేవలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటన ముగిసిన సందర్భంగా ఆమె పలు గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలిశారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ సేవల గురించి వివరిస్తూ, పేదలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పనలో ట్రస్ట్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తలసేమియా బాధితుల కోసం త్వరలో Vijayawada, Anantapurలో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.ఇక తలసేమియా వ్యాధిపై అవగాహన పెంచేందుకు మే 10న Hyderabadలో రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని బాధితులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే హెల్త్ క్యాంపులు, బ్లడ్ బ్యాంకులు, విద్యాసంస్థలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు లక్షల మందికి సేవలు అందించామని వెల్లడించారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు.పర్యటనలో భాగంగా స్థానిక ఆలయ దర్శనం, బాధిత కుటుంబాల పరామర్శ, మహిళలకు ఉపాధి సాధనాల పంపిణీ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

