విశాఖపట్నంలో మంత్రి నారా లోకేష్, కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ ఎండి అలోక్ కిర్లోస్కర్‌ను కలిశారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, రీన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని హైడ్రో టర్బైన్లు, పంపింగ్ సిస్టమ్ తయారీ యూనిట్‌ను APలో స్థాపించాలని మంత్రి సూచించారు. నీటిపారుదల, మునిసిపల్ అవసరాల కోసం వర్టికల్ టర్బైన్ పంపుల ప్లాంట్, పారిశ్రామిక కారిడార్లలో IoT ఆధారిత నీటి–మురుగునీటి వ్యవస్థల ఏర్పాటు, UL/FM సర్టిఫైడ్ ఫైర్ పంపులు, పెద్ద వాల్వ్‌ల తయారీ యూనిట్‌ను APలో నెలకొల్పాలని కోరారు.
అలోక్ కిర్లోస్కర్ మాట్లాడుతూ తమ ఉత్పత్తులు 80 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని, విశాఖ–విజయవాడలో కార్యాలయాలు ఉన్నాయని, AP ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు.

